ముకుంద ప్లాన్ ని కృష్ణ పసిగట్టగలదా?
on Sep 22, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -268 లో.. అందరి ముందు మురారిని కృష్ణ ఆటపట్టించిందని తననీ కూడా అటపట్టించాలని మురారి అనుకుంటాడు. కాసేపటికి కృష్ణని గట్టిగా పట్టుకుంటాడు మురారి. ఇద్దరు తమ మనసులో ఇద్దరిపై ప్రేమని చెప్పుకుంటారు. ఆ తర్వాత మీరెప్పుడు మీ ప్రేమని చెప్తారు సర్ మీరు చెప్పేదాకా నా ప్రేమని దాచుకోలేకపోతున్నానని కృష్ణ అనుకుంటుంది.
ఆ తర్వాత నేను ఎంత తెగించిన అలుసు అయిపోతున్నాను తప్ప మురారికి నా ప్రేమ అర్థం కావడం లేదు. ఇంట్లో అందరు నాకు ప్రత్యర్థులే అని ముకుంద ఫీల్ అవుతుంది. మరొక వైపు మురారి తన కాలేజీ డేస్ గురించి కృష్ణకి చెప్తూ వస్తుంటాడు. ముకుంద అలాగే చూస్తూ ఉండిపోతుంది. నిన్న మురారికి ఇష్టమైనవి చేసావ్. ఈ రోజు ఎవరికీ ఇష్టమైనవి చేసావని ముకుందని కృష్ణ అడుగుతుంది. ఇష్టమైన వాళ్ళు తినడానికి చేసానని ముకుంద చెప్తుంది. ఆ తర్వాత అందరికి నేనొక నిర్ణయం తీసుకున్నానని, హాస్పిటల్ కి లాంగ్ లీవ్ పెట్టానని కృష్ణ చెప్తుంది. ఎందుకని భవాని అడుగుతుంది. ఆదర్శ్ వచ్చేలోపు ముకుందకి అన్ని పనులు నేర్పిస్తానని కృష్ణ చెప్తుంది. అవసరం లేదు నువ్వు హాస్పిటల్ కి వెళ్ళమని రేవతి చెప్తుంది. అలా అనగానే కృష్ణని ఈ రకంగా ఇంట్లో నుండి పంపించొచ్చని ముకుంద మనసులో అనుకుంటుంది. నాకు అన్ని నేర్పించడానికి నేను ఒప్పుకుంటున్నాని ముకుంద చెప్తుంది. ఆ తర్వాత మురారి పక్కనే ఉండి ముకుంద వడ్డిస్తుంటే కృష్ణకి కోపం వస్తుంది.
మరొక వైపు కృష్ణకి నిజం తెలిసిపోయిందని తెలియక రేవతి కంగారు పడుతుంది. ఎక్కడ కృష్ణకి ముకుంద నిజం చెప్తుందోనని అదే విషయం టెన్షన్ పడుతు మురారికి చెప్తుంది రేవతి. మరొక వైపు ముకుందకి అలేఖ్య కాఫీ తీసుకొని వస్తుంది. నాకు ఎందుకో కృష్ణకి మీ ప్రేమ సంగతి తెలిసిపోయిందని అనిపిస్తుందని అలేఖ్య అంటుంది. తెలిస్తే ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. తెలియాలనే కదా నా ప్రయత్నమని అలేఖ్యతో ముకుంద అంటుంది. మరొక వైపు అమ్మాయిలు, అబ్బాయిల సైకాలజీ గురించి కృష్ణ, మురారి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
